భారతదేశం 91–97% దిగుమతులపై ఆధారపడటం తగ్గించేందుకు చిలీ, ఆస్ట్రేలియా వంటి దేశాల మైనింగ్ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2030లో 3–3.3 మిలియన్ టన్నుల అవసరం, 2047 నాటికి 9.8 మిలియన్ టన్నుల అవసరాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రోత్సాహక ప్యాకేజీలు, కస్టమ్స్ మినహాయింపులు, స్క్రాప్ ప్రాసెసింగ్ సౌకర్యాలతో కొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే చిలీ, పెరూ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతున్నాయి. భారత కంపెనీలను కూడా విదేశీ గనుల ప్రాజెక్టుల వైపు ప్రోత్సహించనుంది. దీని వల్ల దాదాపు 12.2 మిలియన్ టన్నుల వనరులు వాడుకలోకి రానున్నాయి.