Headline Image
బాల‌య్య‌, ప్ర‌భాస్‌ల‌కు షాక్‌.. బెట్టింగ్ యాప్ కేసు?

తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మ‌రో కీల‌క వ్య‌వ‌హారం.. బెట్టింగ్ యాప్స్‌. ఈ యాప్స్ బారిన ప‌డి.. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 18 మంది బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డ్డార‌ని అధికారులు లెక్క‌లు తీశారు. దీంతో ప్ర‌భుత్వం అలెర్ట‌యి.. బెట్టింగ్ యాప్‌ల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఈ యాప్‌ల‌కు విప‌రీత ప్ర‌చారం క‌ల్పిస్తున్న సినీ తార‌లు, యూట్యూబ‌ర్లు, ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు.. ఇలా అన్ని వ‌ర్గాల వారిపైనా దృష్టి పెట్టారు. శ‌నివారం.. ప‌లువురు తార‌ల‌పైనా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌పైనా కేసులు న‌మోదు చేశారు.