Headline Image
జ‌గ‌న్ కు బిగ్ షాక్‌.. వైసీపీకి మ‌రో కీల‌క నేత రాజీనామా!

వైసీపీ అధ్య‌క్ష‌డు, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. తాజాగా వైసీపీకి మ‌రో కీల‌క నేత రాజీనామా చేశారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వైసీపీలో ముఖ్య నేత‌గా ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి, పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కు పంపించారు.