Headline Image
`విశాఖ` పోతోంది.. క‌ద‌లవేమి జ‌గ‌న‌న్నా: వైసీపీ ఫైర్‌

మిన్ను విరిగి మీద ప‌డుతున్నా.. చ‌లించ‌ని నాయ‌కుడిగా.. త‌న దైన శైలిలోనే రాజ‌కీయాలు చేస్తార‌న్న పేరు గ‌డించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఇప్పుడు కూట‌మి పార్టీలు మ‌రో భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల‌ను కూట‌మి పార్టీలు కైవ‌సం చేసుకున్నాయి. వాస్త‌వానికి 2021-22 మ‌ధ్య జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఆయా స్థానిక సంస్థ‌ల్లోని కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు సైతం.. జెండా మార్చేశారు.