ఇండ‌స్ట్రీకి

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

Posted on: 02-07-2025

Categories: Telangana | Movies

తెలంగాణ సినీ రంగానికి సీఎం రేవంత్ రెడ్డిబిగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. `ఏం కావాలో చెప్పండి.. చేసేందుకు, ఇచ్చేందుకు కూడా సిద్ధం గా ఉన్నాం.“ అని ఆయ‌న ప్ర‌క‌టించారు. తాజాగా శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగిన `గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల వేడుక‌`లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు త‌మ ప్ర‌భుత్వం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్ప‌టికీ.. అవి సినీ రంగాన్ని బ‌లోపేతం చేసేందుకేన‌ని..ఎవ‌రినీ నొప్పించేందుకు కాద‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ప‌రంగా కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు.

Sponsored