ఏపీలో డీఎస్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. మెగా డీఎస్సీ ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. 16347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి జూలై వరకూ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 3 లక్షల 36 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 92 శాతం మంది హాజరయ్యారు. తాజాగా ఏపీ డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు.