తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధత తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉండగా.. ఈ నెల 16 లేదా 17న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై నాయకుల అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా, పార్టీలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించారు.