ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్ల మార్పుపై దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల నుండి వినతులను స్వీకరించాలని కోరింది. అయితే, సోషల్ మీడియాలో మరో ఆరు కొత్త జిల్లాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, ఆదోని జిల్లాలంటూ జాబితా వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. లిస్ట్ మాత్రం వైరల్ చేస్తున్నారు.