ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో లాజిస్టిక్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. తాజాగా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మరో రెండు భారీ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. తక్కువ ధరకే సరకు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రెండు జిల్లాల్లో భూమిని గుర్తించి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు.