తెలంగాణలో గత ఐదు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. తాజాగా.. రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చిరకలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.