ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు తాము సిద్ధమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా బనకచర్ల లో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణలో తీవ్ర రచ్చే సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నుంచి తీవ్ర విమర్శలుఎదురవుతున్నాయి. ఇక, అధికార పార్టీ కాంగ్రెస్ కూడా దీనిపై సీరియస్‌గానే ఉంది.