ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా సెప్టెంబరు చివర్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బహుభాషా చిత్రంలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తోంది. తొలి షెడ్యూల్ విదేశాల్లో జరగనుంది. ఇందుకోసం మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్‌లలో లొకేషన్లు డైరెక్టర్ పరిశీలించాడు. ప్రభాస్ నవంబరు నాటికి షూటింగ్‌లో పాల్గొననున్నారు. శక్తిమంతమైన పోలీస్ పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

విదేశాల్లో ‘స్పిరిట్’ ఫస్ట్ షెడ్యూల్.. ప్రభాస్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే!
Posted on: 12-08-2025
Categories:
Movies