హైదరాబాద్ నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి తీపి కబురు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కారణంగా గత కొద్ది నెలలుగా ఆ స్టేషన్ నుంచి పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) చేపట్టిన రూ.700 కోట్ల విలువైన పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అనేక రైళ్లను చర్లపల్లి నుంచి మళ్లించడంతో జంట నగరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన రైల్వే అధికారులు, ప్రయాణీకుల డిమాండ్, తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.