ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ హారర్ ఫాంటసీ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలై చాలాకాలం అయినా ఇంకా పూర్తి కాలేదు. భారీ సెట్లు, వీఎఫ్‌ఎక్స్ ఉన్న ఈ చిత్రంలో వరుస రీషూట్లు జరుగుతున్నాయి. అవుట్‌పుట్ పట్ల అసంతృప్తి కారణంగా మళ్లీ మళ్లీ సన్నివేశాలు తీస్తున్నారని సమాచారం. ఇందులో సంజయ్ దత్ భారీ భూతంగా, ప్రభాస్‌తో పోరాట సన్నివేశంలో పిడికిలిలో పట్టుకునే సీన్‌పై మేకర్స్ డైలామాలో ఉన్నారట.