వామ్మో

వామ్మో ‘రాజా సాబ్’ రన్ టైమ్ అంతా... సీక్వెల్‌‌పై నిర్మాత క్లారిటీ!

Posted on: 06-08-2025

Categories: Movies

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమా రన్‌టైమ్ పై స్పందించారు. మొత్తం నాలుగున్నర గంటల ఫుటేజ్ రెడీ అయిందని, ఎడిటింగ్ తర్వాత సినిమా 2 గంటల 45 నిమిషాలు లేదా 3 గంటల రన్‌టైమ్‌లోకి కుదించబడుతుందని తెలిపారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్, కామెడీ, పాటలు, విజువల్స్ అన్నీ ఉండబోతున్నాయని చెప్పారు. అలాగే రాజాసాబ్ 2 కూడా కచ్చితంగా ఉంటుందన్నారు.

Sponsored