నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ యాప్‌లకు ప్రచారం చేసిన నేపథ్యంలో ఆయన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి అందుకున్న పారితోషికాలు, కమీషన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్‌ను విచారించిన ఈడీ, రానా దగ్గుబాటి (11వ తేదీకి), మంచు లక్ష్మీ (13వ తేదీకి) విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు ఈ కేసులో దర్యాప్తులో ఉండటం కలకలం రేపుతోంది.

బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో ఈడీ ముందు హాజరైన విజయ్ దేవరకొండ.. టైమ్ పాస్ ప్రశ్నలు వేయొద్దంటూ అసహనం
Posted on: 06-08-2025
Categories:
Movies