అందుకే

అందుకే ఈ క్యారెక్టర్ చేశా.. ‘వార్ 2’పై ఓపెన్ అయిన ఎన్టీఆర్

Posted on: 06-08-2025

Categories: Movies

‘వార్ 2’లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న జూనియర్ ఎన్టీఆర్‌ ఇటీవల ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు. కథ, స్ర్కిప్ట్ నచ్చడంతోనే ‘వార్ 2’లో నటించినట్లు తెలిపారు. తనకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ వంటి పదాలు నచ్చవని... దేశవ్యాప్తంగా సినీ రంగం అంతా ఒక్కటే అన్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తాను మంచి కుక్‌నని.. బిర్యానీ చాలా బాగా చేస్తానని చెప్పారు.

Sponsored