మంచు మనోజ్ హీరోగా ఇండస్ట్రీలో 21 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ తన 21వ సినిమాను అధికారికముగా ప్రకటించారు. పనిలో పనిగా టైటిల్ పోస్టర్ ను కూడా లాంచ్ చేశారు. ఇది 1897-1922 మధ్య కాలంలో జరిగిన కథతో తెరకెక్కే హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని తెలిపారు. 'భైరవం' సినిమాతో విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్.. ఇప్పుడు మళ్లీ హీరోగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మంచు వారబ్బాయి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.