అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరగడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. థియేటర్ వద్ద భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించింది

‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. సీఎస్‌కు NHRC షోకాజ్ నోటీసులు
Posted on: 06-08-2025
Categories:
Movies