టాలీవుడ్‌లో ప్రస్తుతం అన్ని సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. వేతనాల్లో 30% పెంపు కోరుతూ సినీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత చిట్టిబాబు స్పందిస్తూ – కార్మికుల డిమాండ్లలో తప్పు లేదు కానీ, ఒకేసారి 30శాతం పెంపు డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదన్నారు. డైలీ వేతనాలు ఆర్టిస్టులకు ఇస్తున్నప్పుడు కార్మికులకు ఎందుకివ్వరని నిర్మాతలని ప్రశ్నించారు. నిర్మాతలు, కార్మికులు కలిసి చర్చలు జరిపి 15% వేతన పెంపుతో రాజీకి రాగలిగితే మంచి పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.

నిర్మాతలు తప్పు చేస్తున్నారు.. సమ్మె ఆపకపోతే ఇండస్ట్రీకి నష్టమే - చిట్టిబాబు
Posted on: 05-08-2025
Categories:
Movies