తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మృణాల్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించడంతో ఈ గాసిప్‌కు మరింత బలమొచ్చింది. కార్యక్రమమంతా ఆమె పక్కనే ఉంటూ, సన్నిహితంగా ప్రవర్తించిన ధనుష్‌ను చూసినవారు ఇద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ధనుష్ పలు హీరోయిన్లతో రిలేషన్‌లో ఉన్నాడన్న వార్తలతో పాటు, ఐశ్వర్య విడాకుల విషయం నేపథ్యంలో ఈ వార్తలు మరింత వేడి పుట్టిస్తున్నాయి.