గత మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న తమిళ నటి మీరా మిథున్‌పై చెన్నై కోర్టు తాజాగా అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2021లో షెడ్యూల్డ్ కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెతో పాటు శ్యామ్ అభిషేక్‌పై కేసు నమోదైంది. 2022లో అరెస్టైనప్పటికీ, బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి విచారణకు హాజరుకాలేదు. దీంతో కోర్టు పోలీసులకు వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మీరా మిథున్‌పై ఈ తాజా ఆదేశాలు కలకలం రేపుతున్నాయి