విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్‌డమ్ మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనా, వసూళ్ల పరంగా ఇప్పుడు కొంత తగ్గుదల కనిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మొదటి రోజునే రూ.18 కోట్లు నెట్ రాబట్టి విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఐదో రోజుకల్లా భారత్‌లో నికర వసూళ్లు రూ.43.15 కోట్లుగా అంచనా వేయబడుతున్నాయి. మొదటి వారం చివరికి వసూళ్లు తగ్గుతుండగా, ప్రపంచవ్యాప్తంగా మాత్రం నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.82 కోట్లు దాటి వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఐదోరోజు షాకిచ్చేలా ‘కింగ్‌డమ్’ కలెక్షన్లు.. మరీ అంత తక్కువా
Posted on: 05-08-2025
Categories:
Movies