తల్లికి వందనం పథకం అందక రాష్ట్రవ్యాప్తంగా తల్లులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మేరకు వారి నుంచి అధికారులు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. కొందరు విద్యార్థులకు అర్హుల జాబితాలో పేరు ఉన్నా డబ్బులు రాలేదు.. ఇలా అన్ని సమస్యల్ని పరిశీలించి పరిష్కరించే పనిలో ఉన్నారు. వివిధ కారణాలతో డబ్బులు రాని వాళ్ల అప్లికేషన్లను పరిశీలించి వచ్చే నెలలో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు.