కొత్త

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 34 లక్షల మందికి రేషన్, ఆగస్టు 20 నుంచి..

Posted on: 12-08-2025

Categories: Politics | Telangana

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ఇది నిజంగా శుభవార్త. వచ్చే నెల.. అంటే సెప్టెంబర్ నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డులతో పాటు.. పాత కార్డుల్లో కొత్తగా సభ్యులుగా చేరిన వారికి కూడా ఈసారి బియ్యం అందనుంది. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా జూన్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే జూలై, ఆగస్టు నెలల్లో పంపిణీ ఆగిపోయింది.

Sponsored