పర్యాటక రంగం మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. స్వదేశీ దర్శన్ 2.0 కార్యక్రమం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం రూ.98 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సూర్యలంక బీచ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు,. ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలు వంటివి ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తొలివిడతలో 50 కోట్ల పనులకు టెండర్లు కూడా పిలిచారు.