విజయనగరం జిల్లా్లో దారుణం చోటుచేసుకుంది. అత్తతో సంబంధం పెట్టుకున్న అల్లుడు.. మేనమామను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే నిందితుడిపై పాత కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. మేనమామ, మేనత్తల వద్ద ఉంటే పద్ధతిగా ఉంటాడని అతని తల్లిదండ్రులు భావిస్తే.. మనోడి వ్యవహారంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.