ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన గ్రామాలలో పాఠశాలల అభివృద్ధి మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్కూళ్ల కోసం నిధులు కేటాయించింది. అల్లూరి జిల్లాలోని 85 స్కూళ్లల్లో 286 అదనపు గదులు నిర్మించేందుకు, అలాగే మరమ్మత్తుల కోసం 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.