జగపతిబాబు హోస్ట్‌గా 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షో ప్రారంభం కానుంది. మొదటి ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రోమోలో నాగార్జున, జగపతిబాబుల మధ్య సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. వారిద్దరి మధ్య వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరి మధ్య స్నేహబంధం షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.