హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వార్ 2' ఆగస్టు 14న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నారు హృతిక్. తారక్ తనకు తమ్ముడు లాంటి వాడని, అతని నుంచి ఎంతో నేర్చుకున్నానని కొనియాడారు. 'వార్ 2' తన కెరీర్‌లోనే టాప్ సినిమా అవుతుందని హృతిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వన్ టేక్ స్టార్ అని, అతనితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని అన్నారు.