సాగరతీరం విశాఖపట్నం రోజురోజుకూ విస్తరిస్తోంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాలలో విశాఖ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీఎంఆర్డీఏ కీలక ప్రతిపాదనలు చేసింది. విశాఖలో నాలుగు థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందుకోసం కన్సల్టెంట్ల నియామకం కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సమర్పించింది. నాలుగు ప్రాంతాలలో ఈ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయనున్నారు.