ఏలూరు పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కైండ్‌నెస్ వాల్ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించారు. ఏలూరు పోలీస్ స్కూల్ సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ అల్మారాలో మనకు అవసరం లేని వస్తువులు ఉంచి.. అప్పటికే ఉన్న వస్తువులలో మనకు కావాల్సినవి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏలూరు పోలీసులు ఈ కార్యక్రమం ప్రారంభించారు. పోలీసుల తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.