ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతాలు, గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. 'అడవితల్లి బాట' పేరుతో జరుగుతున్న ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజనుల రవాణా కష్టాలను తొలగించి, మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రంలోని 652 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.