పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగ, తాళం పగులగొట్టి లోపలికి వెళ్ళాడు. తలుపు తీయగానే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఒక్కసారిగా పెద్దగా అలారం మోగడంతో భయంతో పారిపోయాడు. ఇంటి యజమాని పద్మజ ఇంటికి ఎవరైనా వస్తే తన మొబైల్‌కు మెసేజ్, అలారం మోగేలా అలా సెట్ చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.