విశాఖపట్నం జిల్లాలో, చిట్టపులి రామ్‌కుమార్ అనే వ్యక్తి 11 ఏళ్ల క్రితం ఆరోగ్య ఉపకేంద్రం కోసం తన భూమిని దానం చేశారు. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది, కానీ నెరవేర్చలేదు. విసిగిపోయిన రామ్‌కుమార్ ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. తనకు ఉద్యోగం కల్పించే వరకు తాళం తీసేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు.