మీడియా రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ వెర్టోజ్ లిమిటెడ్ షేర్లు ఈ రోజు ట్రేడింగ్‌లో ఫోకస్‌లో ఉండనున్నాయి. గత ఏడాది కాలంలోనే ఈ కంపెనీ స్టాక్ 164 శాతం మేర లాభాన్ని అందించింది. అలాగే గత నెలలోనే ఎక్స్-బోనస్, ఎక్స్-స్ప్లిట్ ట్రేడింగ్ చేసింది. అంతే కాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియో స్టాక్ కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. క్యూ1 ఫలితాల్లో మంచి లాభాలు అందుకుంది.