ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మియా భాయ్ సిరాజ్ అదరగొట్టాడు. చివరి టెస్టులో అతని పోరాటం అద్భుతం. బౌలింగ్ లో అదరగొట్టి తన కెరీర్ లోనే బెస్ట్ రేటింగ్స్ సొంతం చేసుకున్నాడు. ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా రాణించడంతో ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. సిరాజ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు ఎగబాకితే, ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 25 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ బుమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు.

కెరీర్ బెస్ట్ రేటింగ్‌లో సిరాజ్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో మియా భాయ్ హవా!
Posted on: 06-08-2025
Categories:
Sports