అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఈసారి కవిత, కేటీఆర్‌లు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి నెలకొంది. గత ఏడాది కవిత జైలులో ఉండటం వలన రాఖీ కట్టలేకపోయారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, రక్త సంబంధం వేరని, తప్పకుండా ఈ సంవత్సరం తన అన్న కేటీఆర్‌కు రాఖీ కడతానని కవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారి రాఖీ వేడుక ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది.