కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేసింది. దీనిలో ముఖ్యంగా రైతులకు కూడా ఉపయోగపడే విధంగా స్కీమ్స్ అమలు చేస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు దీనిలో ఉన్నాయి. వీటిలో రైతు భరోసా ద్వారా వస్తున్న డబ్బులతో రైతులు పెట్టుబడి సాయం కింద ఉపయోగిస్తున్నారు. రైతు బీమా ద్వారా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి.. బీమా సొమ్మును చనిపోయిన రైతు కుటుంబానికి అందజేస్తున్నారు.