ప్రతీ నెల 30 శాతం వరకు డబ్బులను ఆదా చేసుకొని.. ప్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్‌లను కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారి సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. అయితే ప్రభుత్వం కొన్ని ప్లాట్లను తక్కువ ధరలకు వేలం వేసి విక్రయిస్తున్నారు. దీనిలో వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిలో భాగంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లకు వేలం వేయగా దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.