రాజమహేంద్రవరంలో శివాలయం పక్కనే శ్మశానం ఉంది. ఇక్కడ దహనం చేసిన చితాభస్మాన్ని పక్కనే ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో శివయ్యకు అభిషేకం చేస్తారు. ఆలయం పక్కన ఉన్న కైలాస భూమికి 'లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు' కూడా లభించిందని చెబుతున్నారు. అంతేకాదు ఈ శ్మశానంలో మూడు ఎకరాల్లో పూల మొక్కలు కూడా పెంచారు. చూడటానికి ఓ పార్క్‌లా అనిపిస్తుంది. గోదావరి ఒడ్డున శ్మశానం, ఆలయం ఉన్నాయి.