నంద్యాల జిల్లాలోని బనగానపల్లె దగ్గర పాతపాడు శివారులో ఒక బంగ్లా ఉంది. అరుంధతి సినిమాలో కనిపించడంతో దీన్ని అందరూ అరుంధతి బంగ్లా అంటున్నారు. ఇక్కడ చాలా సినిమాలు, సీరియల్స్ కూడా తీశారు. కానీ ఇప్పుడు ఈ చారిత్రక ప్రదేశం శిథిలావస్థకు చేరుకుంది. నవాబు వారసులమని చెప్పుకునే వాళ్లు ఇక్కడికి వచ్చే సందర్శకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. కానీ వారు బంగ్లాను మాత్రం పట్టించుకోవడం లేదు అంటున్నారు.