తిరుమల

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విశాఖపట్నంవాసుల కొత్త డిమాండ్.. టైమ్ మారిస్తేనే!

Posted on: 06-08-2025

Categories: Politics | Andhra

తిరుమల శ్రీవారి దర్శనం కోసం టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి విమానాశ్రయంలో కౌంటర్ ఏర్పాటు చేసి రోజుకు 200 టికెట్లు ఇస్తున్నారు. అయితే ఈ టికెట్ల విషయంలో విశాఖపట్నం వాసులు ఇబ్బందిపడుతున్నారట. విశాఖపట్నం నుంచి వెళ్లే విమానం మధ్యాహ్నానికి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటోంది. కానీ 200 దర్శన టికెట్లు ఉదయం 9లోపే ఖాళీ అవుతున్నాయి.. కౌంటర్ మూసివేవస్తున్నారని చెబుతున్నారు.

Sponsored