ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలులోని గూడెం కొట్టాల వాసులు నారా లోకేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 40 ఏళ్ల నుంచి ఉంటున్నామని.. శాశ్వత ఇళ్లపట్టాలు ఇప్పించాలని కోరారు. దీంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన లోకేష్.. తాజాగా 150 మందికి శాశ్వత ఇళ్లపట్టాలు పంపిణీ చేయించారు.