ఏపీ ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ రెండో తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు. సుమారుగా 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.7000 చొప్పున జమ చేశారు. అలాగే ఈ- కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ వంటి కారణాలతో రానివారికి ప్రక్రియ పూర్తి చేస్తే డబ్బులు జమ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో సైబర్ మోసాలకు తెరతీశారు కేటుగాళ్లు.