జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లకు చెందిన ఓ వ్యాపారిని ఒక పాము రూపంలో దురదృష్టం పలకరించింది. గత 15 ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న బట్టల దుకాణం, కూడబెట్టిన డబ్బు ఒక పాము కారణంగా జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో రూ.50 లక్షల విలువైన వస్త్రాలు, ఫర్నీచర్, నగదు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన శ్రీనివాస్‌కు ప్రభుత్వం సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.