తిరుమలలో

తిరుమలలో చిరుత కలకలం.. అదే ప్లేస్‌లో మనిషి ఉంటే.. సీసీ ఫుటేజ్ వైరల్

Posted on: 05-08-2025

Categories: Politics | Andhra

తిరుమలలో చిరుత సంచారం భయాందోళనలు రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం దగ్గర చిరుత కనిపించింది. ఆ ప్రాంతంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇటీవల కాలంలో తిరుమలతో పాటుగా తిరుపతిలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. తిరుపతిలో రెండు వారాల క్రితం బైక్‌పై వెళుతున్న వ్యక్తిపైకి చిరుత దూకిన ఘటన కలకలం రేపింది.

Sponsored