అవినీతిని అడ్డుకోవాల్సిన పోలీసులే.. లంచాలు తీసుకోవడమే కాకుండా.. వాటి పంపకాల్లో వచ్చిన తేడాల కారణంగా అడ్డంగా పట్టుబడ్డారు. సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన వాహనాలను.. అమ్ముకుని ఇద్దరు కానిస్టేబుళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా గత కొంత కాలంగా స్టేషన్‌లోని బండ్లను.. అడ్డదారుల్లో తక్కువ ధరకే విక్రయించి.. వచ్చిన డబ్బులను పంచుకునేవారు. అయితే తాజాగా వాటాల పంపిణీలో వచ్చిన తేడాలు.. వారి బాగోతాన్ని వారే బయటపెట్టుకునేలా చేశాయి.