నెల

నెల క్రితం జంట ప్రేమ పెళ్లి.. టీడీపీ ఎమ్మెల్యే సాయం.. ఇంతలోనే ప్రాణాలు పోయాయి

Posted on: 02-07-2025

Categories: Andhra

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో జరిగిన పేలుడు విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 36 మంది మరణించారని, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీ రమ్య అనే నూతన దంపతులు ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వారి కోసం గాలిస్తున్నారు.

Sponsored