క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి మైదానంలోనే హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటన పంజాబ్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకెళ్తే.. ఫిరోజ్‌పూర్‌కు చెందిన హర్జీత్ సింగ్ అనే యువకుడు, స్థానికంగా ఉన్న డీఎవీ స్కూల్‌లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వచ్చాడు.మొదట తాను ఎదుర్కున్న బంతిని బౌలర్ తలమీదుగా భారీ సిక్సర్ కొట్టిన హర్జీత్.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మరో బ్యాటర్‌తో మాట్లాడేందుకు పిచ్ మధ్యలోకి వెళ్లాడు. కాస్త ఇబ్బందిగా అనిపించడంతో అక్కడే కూర్చున్న అతడు.. ఉన్నట్టుండి కూలబడిపోయా పక్కనున్న వ్యక్తి వెంటనే స్పందించి హర్జీత్‌ను పైకి లేపేందుకు యత్నించినా.. సీపీఆర్ చేసినా హర్జీత్ ప్రాణాలు దక్కలేదు. గుండెపోటుతో అతడు మరణించాడని పోలీసులు తెలిపారు.

సిక్స్ కొట్టి.. ప్రాణాలు విడిచి.. పంజాబ్‌లో క్రికెట్ ఆడుతూ మృత్తి
Posted on: 30-06-2025
Categories:
Around The World